Header Banner

నెలకు రూ.లక్షన్నర జీతంతో హిందూస్థాన్ పెట్రోలియంలో జాబ్స్..! ఇలా దరఖాస్తు చేసుకోండి!

  Thu May 15, 2025 09:14        Employment

ముంబయిలోని హిందూస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (HPCL).. వివిధ విభాగంల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 103 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయనుంది. సంబంధిత స్పెషలైజేషన్‌లో డిప్లొమా ఉత్తీర్ణత గల అభ్యర్థులు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఆకర్షణీయ జీతంతో పాటు ఇతర అలవెన్స్‌లు కూడా కల్పిస్తారు.

పోస్టుల వివరాలు ఇవే..

  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ – మెకానికల్ పోస్టుల సంఖ్య: 11
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ – ఎలక్ట్రికల్ పోస్టుల సంఖ్య: 17
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ – ఇన్‌స్ట్రుమెంటేషన్ పోస్టుల సంఖ్య: 6
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ – కెమికల్ పోస్టుల సంఖ్య: 41
  • జూనియర్ ఎగ్జిక్యూటివ్ – ఫైర్ & సేఫ్టీ పోస్టుల సంఖ్య: 28

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు పోస్టును అనుసరించి సంబంధిత ఇంజినీరింగ్ విభాగాల్లో మెకానికల్, ఎలక్ట్రికల్, ఇన్‌స్ట్రుమెంటేషన్, కెమికల్ లేదా ఫైర్ అండ్‌ సేఫ్టీలో 3 ఏళ్ల డిప్లొమా కలిగి ఉండాలి. లేదంటే సైన్స్‌ విభాగంలో ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. వయోపరిమితి కింద దరఖాస్తు చివరి తేదీ నాటికి 25 ఏళ్లకు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ ఎన్‌సీ వారికి 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ వారికి 15 ఏళ్ల వరకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ విధానంలో మే 21, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు కింద ప్రతి ఒక్కరూ రూ.1180 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ఎలాంటి దరఖాస్తు పీజు లేదు. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష (CBT), గ్రూప్ డిస్కషన్, టాస్క్, స్కిల్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, మెడికల్ ఫిట్‌నెస్ ద్వారా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.30,000 నుంచి రూ.1,20,000 వరకు జీతంగా చెల్లిస్తారు.

ఇది కూడా చదవండితల్లులకు భారీ శుభవార్త.. తల్లికి వందనం అమలుపై అప్‌డేట్! ఆ రోజు అకౌంట్లలోకి మనీ!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

మరోసారి భారీగా ఉద్యోగాల కోతకు సిద్ధమైన మైక్రోసాఫ్ట్! వేల మంది టార్గెట్!


వీరయ్య చౌదరి హత్య కేసు ఛేదించిన పోలీసులు.. 9 మందిని అరెస్ట్! హత్యకు కారణం ఇదే!

వైసీపీకి షాక్.. మాచర్ల మున్సిపల్ చైర్మన్కు షాకిచ్చిన సర్కార్.. పదవి నుండి తొలగింపు!

సింధూ జలాలపై కాళ్ల బేరానికి పాకిస్థాన్! భారత్‌కు విజ్జప్తి చేస్తూ లేఖ!

కడప మేయర్ కు భారీ షాక్‌! అవినీతి ఆరోపణలతో పదవి నుండి తొలగింపు!


చంద్రబాబు నేతృత్వంలో పొలిట్‌బ్యూరో సమీక్ష! నామినేటెడ్ పదవులపై ఫోకస్!


బెట్టింగ్ మాఫియాకు షాక్! ఇద్దరు బుకీలు అరెస్ట్.. మాజీ కేసులు మళ్లీ రంగంలోకి!

 

పొరపాటున వేరే రైలెక్కిన మహిళ..! ఇంతలోనే ఎంత ఘోరం..!

 

హైదరాబాద్‌ విమానాశ్రయంలో హై అలెర్ట్! డ్రోన్లకు నో పర్మిషన్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #HPCLJobs #HindustanPetroleum #HighSalaryJobs #GovernmentJobs #ApplyNow #JobAlert #EmploymentNews